సంగారెడ్డి: మా కాలనీలో వైన్స్ ను తొలగించండి ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన కాలనీ వాసులు
సంగారెడ్డి పట్టణంలోని వీరభద్రనగర్లో ఉన్న వైన్స్ ను తొలగించాలని కోరుతూ స్థానికులు సోమవారం అదనపు కలెక్టర్ మాధురికి వినతిపత్రం అందజేశారు. వైన్స్ కారణంగా కాలనీవాసులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని వారు వివరించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది అనంతరావు కులకర్ణి, రవిశంకర్, ఇతర కాలనీవాసులు పాల్గొన్నారు.