వాయు కాలుష్యాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Oct 18, 2025
వాయు కాలుష్యాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. రోజువారీ కార్యక్రమాలలో ఈ దిశగా దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. " స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర " కార్యక్రమంలో భాగంగా ప్రతినెలా మూడవ శనివారం ప్రత్యేక ఇతివృత్తంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈనెల ' క్లీన్ ఎయిర్ ' ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రకాశం భవనంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు