కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అత్యంత వైభవంగా గండాదీప కార్యక్రమం
కళ్యాణదుర్గంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా గండాదీప కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తలలపై గండా దీపాన్ని వెలిగించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం వాసవి మాత వద్ద గండా దీపాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయంతో పాటు పరిసరాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.