గోపెపల్లి తాండ అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో శ్రీనివాసులు
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం గోపెపల్లి తాండలోని అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం మధ్యాహ్నం ఎంపీడీవో శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీల పరిసర ప్రాంతాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల హాజరు రికార్డులను పరిశీలించారు. పంచాయతీ సెక్రటరీ, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.