పాణ్యం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్, మాజీ MLA రాంభూపాల్ ఆవిష్కరణ
పాణ్యం మాజీ ఎమ్మెల్యే, వై.యస్.ఆర్.సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 12న ఉదయం 9:30 గం.లకు ఆయన ఇంటి నుంచి కల్లూరు తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.