మంత్రాలయం: పెద్ద కడబూరు మండల టీడీపీ అధ్యక్ష పదవిపై అపోహలు వద్దు : టీడీపీ రాష్ట్ర నేత నరవ రమాకాంత రెడ్డి
పెద్ద కడబూరు : టీడీపీ మండల అధ్యక్ష పదవిపై అపోహలు వద్దని ఆపార్టీ రాష్ట్ర నేత నరవ రమాకాంత రెడ్డి సూచించారు. మంగళవారం పెద్ద కడబూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీలో గ్రూపులు లేవని స్పష్టం చేశారు. అధ్యక్ష పదవి ఎంపికపై ఏవైనా సమస్యలు ఉంటే కూర్చొనీ చర్చించుకుంటామన్నారు . మండలంలో అభిప్రాయ సేకరణ తర్వాతనే ఎంపిక ఉంటుందన్నారు. సీనియార్టీ బట్టి దిట్టికాటి మల్లికార్జునకు అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందన్నారు.