చంద్రగిరి వద్ద రోడ్డు ప్రమాదం ఏడుగురికి గాయాలు
చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం, నాండ్రగుంట జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది కూల్ డ్రింక్స్ తరలిస్తున్న లారీని వెనుక నుంచి తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు బస్సు ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.