అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో డాక్టర్.బాబు రాజేంద్ర ప్రసాద్ 141వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోశాధికారి జెన్నే కుళ్ళాయిబాబు, కార్యదర్శి రామ్మోహన్, ఉపాధ్యక్షుడు షేక్షావలి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ముందుగా డాక్టర్.బాబు రాజేంద్రప్రసాద్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంయుక్త కార్యదర్శి లక్ష్మీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి, భారత తొలి రాష్ట్రపతి, భారతరత్న బాబు రాజేంద్రప్రసాద్ రెండు సార్లు భారత రాష్ట్రపతి పదవి అలంకరించిన ఏకైక వ్యక్తి అన్నారు.