నల్గొండ: పెద్దవూరలో యూరియా కోసం క్యూలో నిలబడిన రైతులను కొట్టిన కానిస్టేబుల్
నల్లగొండ జిల్లా పెద్దవూరలో యూరియా కోసం క్యూలో నిలబడిన రైతులపై కానిస్టేబుల్ దశ్యా నాయక్ దాడి చేశాడు. ఈ సందర్భంగా మంగళవారం తెలిసిన వివరాల కోసం ఎరువుల కోసం ఎదురుచూస్తున్న ముగ్గురు రైతులను చెంపపై బలంగా కొట్టాడు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పడిగాపులు కాస్తుంటే పోలీసులు కూడా దాడులు చేయడంపై రైతులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు తోడుగా నిలవాల్సిన పోలీసులు ఇలా వ్యవహరించడం పట్ల రైతులు,పలువురు విమర్శలను చేశారు. దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు.