రామగుండం: పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నివాళులు అర్పించిన సిపి అంబర్ కిషోర్ ఝా
మహిళ చైతన్యానికి ఆత్మగౌరానికి చాకలి ఐలమ్మ ఒక ప్రతీకాని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శుక్రవారం రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ తెలంగాణ వీర వనిత తెలంగాణ రైతంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని ఆమె పోరాట స్ఫూర్తిని కొనియాడారు.