పుట్టపర్తి కలెక్టరేట్లో విశ్వకర్మ జయంతి వేడుకలు
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో బుధవారం మధ్యాహ్నం విశ్వకర్మ జయంతి వేడుకలు జిల్లా బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్తో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కులవృత్తి గొప్పతనాన్ని, జీవనాధారాన్ని పెంపొందించడం, సాంకేతికతకు మూల పురుషుడు విశ్వకర్మ అని జేసీ తెలిపారు.