ఇరు కలల పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి దంపతులు
నెల్లూరులో వెలసి ఉన్న శ్రీ ఇరు కలల పరమేశ్వరి అమ్మవారిని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. విజయదశమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యే దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే గురువారం సాయంత్రం 5 గంటలకు తెలిపారు.