గంగాధర నెల్లూరు: జీడీ నెల్లూరులో వైసీపీ భారీ ర్యాలీ
గంగాధర్ నెల్లూరులో బుధవారం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు వెల్లడిచారు. బీసీ హాస్టల్ నుంచి MRO ఆఫీసు వరకు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం సరికాదని, వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.