నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని చిత్రేనిపల్లె గ్రామంలో మంగళవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామంలోని కొందరు ఆకతాయిలు సరదాగా గడ్డికట్ట లకు నిప్పు అంటించడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగి భారీ ప్రమాదానికి దారితీశాయి. మంటలు వేగంగా వ్యాపించి, సుమారు 70 గడ్డికట్టలు అగ్నికి ఆహుతయ్యాయి. విషయాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి, వారితో కలిసి మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. పశువుల మేత కోసం నిల్వ చేసుకున్న గడ్డి అంతా కళ్లముందే బూడిద కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.