పులివెందుల: పావు కోడికి ముప్పావు మసాలా అన్నట్లుంది జీఎస్టీ పై మోడీ వైఖరి : వేంపల్లిలో రాజ్యసభ మాజీ సభ్యులు తులసి రెడ్డి
Pulivendla, YSR | Sep 23, 2025 పావుకోడికి ముప్పావు మసాలా అన్నట్లు ఉంది జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీ వైఖరి అని రాజ్యసభ మాజీ సభ్యులు ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం వేంపల్లి లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ,12 ,18 ,28 గా నాలుగు స్లాబులుగా ఉన్న జీఎస్టీని 5 ,18 రెండు స్లాబులుగా చేసినందు వల్ల 345 వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయని, దసరా, దీపావళి పండుగలు ముందుగానే వచ్చేసాయని ప్రధాని మోడీ ,కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలను ఊదర గొట్టారు.