కిర్లంపూడిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు సన్మానం
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు కిర్లంపూడి మండలంలో ఘన సత్కారం జరిగింది. ఎంఈఓ జోసెఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ రమేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులు ఆదినారాయణమూర్తి, సూర్యనారాయణ, వీరవెంకట సత్య నారాయణను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఉపాధ్యాయుల సేవలు అమూల్య మైనవని రమేష్, సర్పంచ్ శ్రీలత, ఎంఈఓ జోసెఫ్ కొనియాడారు.