విలువైన వస్తువులను ఇంట్లో పెట్టి బయటకు వెళ్లొద్దు బేతంచెర్ల సీఐ వెంకటేశ్వరరావు
Dhone, Nandyal | Sep 17, 2025 విలువైన వస్తువులను, నగదును ఇళ్లల్లో పెట్టి బయటకు వెళ్లవద్దని బేతంచెర్ల సీఐ వెంకటేశ్వరరావు సూచించారు. బుధవారం అయినా మాట్లాడుతూ దొంగతనాల నివారణలో భాగంగా అవసరమైన మేరకే వస్తువులను పెట్టుకోవాలన్నారు. విలువైన వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలన్నారు. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు ఫొటోలను గ్రూపుల్లో షేర్ చేయవద్దని సూచించారు. ఎవరైనా అనుమానాస్పద స్థితిలో వ్యక్తులు తిరిగితే సమాచారం ఇవ్వాలని కోరారు.