వర్ని: వీడీసీల ఆగడాలను అరికట్టాలి కోటగిరిలో టి జి ఎస్ రాష్ట్ర కార్యదర్శి విటల్ గౌడ్ డిమాండ్
గ్రామ అభివృద్ధి కమిటీ ఆగడాలను అరికట్టి పీడియాక్ట్టు చట్టాన్ని అమలు చేయాలని టీజీఎస్ రాష్ట్ర కార్యదర్శి విటల్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం మూడు గంటలకు కోటగిరి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని ఏర్గట్ల మండలం తల్లారాంపూర్ లో గౌడ కులస్తులపై అగ్రకులాల వారు దాడి చేయడం హే మమైన చర్య అన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో వీడీసీల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వృత్తిదారులను, కార్మికులను చిన్నచూపు చూస్తూ పెత్తందారి వ్యవస్థను నడిపిస్తున్నారని ఆరోపించారు. వీటిని వెంటనే ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.