కొమరోలు మండలంలో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని శనివారం ఏ. ఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని స్థానిక ప్రజలు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలన్నారు. గోవిందుల పల్లె, గుండ్రెడ్డిపల్లి గ్రామ ప్రజలు గృహ మరియు వ్యవసాయ సంబంధిత విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని గుర్తించాలన్నారు.