రాయదుర్గం: ప్రతిపక్షాల గొంతునొక్కాలని చూస్తే ఊరుకోం : నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షులు గౌని ప్రతాప్ రెడ్డి
టిడిపి నాయకులు ప్రతిపక్షాల గొంతునొక్కాలని చూస్తే చూస్తూ ఊరుకోమని రాయదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌని ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం మద్యాహ్నం రాయదుర్గంలోఆయన మాట్లాడుతూ రాయదుర్గం పట్టణంలో రెండు రోజుల క్రితం వైసిపి నాయకులు చేపట్టిన బాబు ష్యూరిటి మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని టిడిపి నాయకులు అడ్డుకోవడం దుర్మార్గమని అభివర్ణించారు. చంద్రబాబు మోసాలపై ప్రజలకు వివరించడం తప్పెలా అవుతుందన్నారు.