వాకాడు ఎక్సైజ్ స్టేషన్ తనిఖీ చేసిన చిత్తూరు జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు
Gudur, Tirupati | Sep 16, 2025 వాకాడు ఎక్సైజ్ స్టేషన్ ను మంగళవారం అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు ఆచార్య తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాకాడు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కోట, వాకాడు చిట్టమూరు మండలాల్లో 17 వైన్ షాపులు ఉన్నాయని, వాటికి సంబంధించి ఈనెల 20వ తేదీన ఏడవ ఇన్స్టాల్మెంట్ లైసెన్స్ ఫీజు కట్టవలసి ఉన్నందున వాటి మీద రివ్యూ చేసేందుకు ఇక్కడికి రావడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని స్టేషనులను తనిఖీ చేసి రివ్యూ చేస్తున్నామన్నారు. అలాగే మద్యం షాపులకు సంబంధించి ప్రభుత్వం పర్మిట్ రూమ్ లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆయన వెంట ఎక్సైజ్ సూపర్డెంట్ తిరుపతి జిల్లా నాగ మల్లేశ్వర రెడ్డి,వాకాడు ఎక్సై