వెంకటగిరిలో నాకు సెంటు భూమి లేదు: MLA
Gudur, Tirupati | Oct 23, 2025 వెంకటగిరిలో తమకు ఒక్క ఇళ్లు తప్ప మరే ఆస్తి లేదని MLA రామకృష్ణ స్పష్టం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆక్రమించుకుని కోట్లు సంపాదించుకోవాలన్న ఆలోచన తనకు లేదని, తమకున్న ఇంటి స్థలంలోనే కొంత వదిలేశామన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని, లేదంటే తన అవినీతిని నిరూపించాలని కోరారు.