కరెంటు కోసం రోడ్డు ఎక్కిన కోట నెమలిపురి గ్రామస్తులు
రాజుపాలెం మండలం, కోట నెమలిపురి గ్రామస్తులు సోమవారం రాత్రి కరెంటు కోసం రోడ్డెక్కారు. గత 15 రోజులుగా కరెంటు గ్రామంలో ఉండటం లేదని ఎన్నిసార్లు విద్యుత్ శాఖ అధికారులు చెప్పినా కూడా ప్రయోజనం లేదని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మొత్తం కూడా కొండమోడు గ్రామంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ముట్టడించి గుంటూరు హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.