కదిరిలో నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలోని పెద్దన్నవారిపల్లెలో శనివారం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం కదిరి నియోజకవర్గం కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీతో కలిసి నిర్వహించారు. కదిరి నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి పనులు, కార్యకర్తల సంక్షేమంపై చర్చించారు. రాజకీయ పరిస్థితులపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.