వినుకొండ లో వైసిపి నాయుకులు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు : వినుకొండ నియోజకవర్గం టీడీపీ నాయుకులు
వినుకొండ నియోజకవర్గం లో వైసీపీ ప్రధాన కార్యదర్శి లాయర్ ఎం.ఎన్.ప్రసాద్ తన వ్యక్తిగత సంపాదనకు అరాచకాలు సృష్టిస్తున్నారని నియోజకవర్గంo టిడిపి నాయకులు విమర్శించారు. ఇటీవల ఎంఎన్. ప్రసాద్ టిడిపి నేతలపై, కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలు నిరాదారమైన ఆరోపణలు, విమర్శలను ఆదివారం మధ్యాహ్నం 02 గంటల సమయం లో వినుకొండ టీడీపీ కార్యాలయం లో విలేకరుల సమావేశంలో ఖండించారు. ఎంతో ఖ్యాతి కలిగిన వినుకొండ గౌరవాన్ని మంటగలిపే విధంగా వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలకు పాలు పడుతున్నారని అన్నారు.