కొండపి: సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో పర్యటకుల సందడి, ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ జాగ్రత్తలు తీసుకున్న అధికారులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరం పర్యటకులతో కిటికీటలాడింది. కార్తీక మాసం అందులో ఆదివారం సెలవు రోజు కావడంతో పర్యటకులు సముద్రతీరానికి భారీగా తరలివచ్చారు. సముద్రం అలల ఉధృతి కూడా సాధారణంగా ఉండడంతో పర్యటకులు సముద్రంలో ఈత కొట్టేందుకు ఆసక్తి చూపించారు. అయితే అధికారులు ఎప్పటికప్పుడు సముద్రం లోపలికి వెళ్తున్న వారిని హెచ్చరిస్తూ జాగ్రత్త తీసుకున్నారు.