వెంకటగిరిలో డ్రోన్ కెమెరాతో తనిఖీలు నిర్వహించిన సీఐ ఏవి రమణ
Gudur, Tirupati | Sep 16, 2025 తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ శివారు ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాతో విజయవంతంగా తనిఖీలు నిర్వహించినట్లు సీఐ ఏవీ రమణ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత, అనుమానాస్పద కదలికలపై నిఘా, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ఆపరేషన్ చేశామన్నారు. పట్టణ శివారు ప్రాంతాల్లో నేరాలు జరగకుండా చూస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు పోలీసు సిబ్బంది ఉన్నారు