ఒంగోలు పట్టణంలో రోడ్డుకు అడ్డంగా ఉంటున్న గోమాతలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని వాహనదారులు విజ్ఞప్తి
Ongole Urban, Prakasam | Oct 19, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో రోడ్డుకు అడ్డంగా ఉంటున్న గోమాతలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదివారం రాత్రి ఓ ద్విచక్ర వాహనదారుడు సోషల్ మీడియాలో వీడియోలో చిత్రీకరించి వైరల్ గా మార్చాడు. గోమాతలు రోడ్డు మీద ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం గా అధికంగా ఉందని అంతేకాకుండా గోమాతరం కూడా గాయపడే అవకాశం ఉందని కాబట్టి అధికారులు వెంటనే గోమాతలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించి ప్రమాదాలను నివారించాలని కోరారు.