తాడిపత్రి: యాడికి మండలంలోని క్రిష్టపాడు రెగ్యులేటర్, సాగునీటి కాలువలను పరిశీలించిన ఏపీ రైతు సంఘం నేతలు
యాడికి మండలంలో ఏపీ రైతు సంఘం నేతలు పర్యటించారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మండలంలోని సాగునీటి కాలువలను పరిశీలించారు. మండలంలో ఉన్న సాగునీటి కాలువలను పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట రాముడు యాదవ్, తాడిపత్రి నియోజకవర్గం రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఓపిరెడ్డితో కలిసి క్రిష్టిపాడు రెగ్యులేటర్ వద్ద కాలువను పరిశీలించారు. కాలవను ఏర్పాటు చేసిన పిల్లకాలోలు లేకపోవడంతో పూర్తిగా సాగునీరు రైతులకు అందుబాటులోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పిల్లకాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.