సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీ లభ్యమయింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఆస్పత్రి మెయిన్ గేట్ ఫుట్‌పాత్‌పై పడి ఉన్న దాదాపు 60-65 ఏళ్ల వ్యక్తి డెడ్ బాడీ ఉన్నట్లు డయల్ 100కు కాల్ వచ్చింది. పోలీసులు వెళ్లి చూడగా ఎలాంటి వివరాలు లభించలేదు. డెడ్ బాడీని మార్చురీకి తరలించి భద్రపరిచారు. చిలకలగూడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.