ముక్కంటి ఆలయంలో ముగిసిన లక్షబిల్వార్చన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈనెల 9వ తేదీ ప్రారంభమైన లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన బుధవారంతో ముగిసింది. 10 రోజులపాటు జరిగిన ఈ అర్చనలో పలువురు భక్తులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా ఈ అర్చనలు జరిగాయి. లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన ముగింపును పురస్కరించుకొని ఆలయంలో అష్టోత్తర కలశాభిషేకం, హోమం నిర్వహించారు. అనంతరం సువర్ణముఖి నదిలో బిల్వపత్రాలు, కుంకుమ నిమజ్జనం చేశారు.