సంతనూతలపాడు: మాచవరంలో వర్షాలకు దెబ్బతిన్న ఆర్ అండ్ బి రహదారి మరమ్మత్తు పనులను పరిశీలించిన డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపి నాయక్
సంతనూతలపాడు మండలం మాచవరం లో ఇటీవల తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఆర్ అండ్ బి రహదారి దెబ్బ తినడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికారులు ఈ రహదారికి మరమ్మతు పనులను చేపట్టారు. ఒంగోలు డివిజనల్ ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపి నాయక్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జానీ వలి ఆదివారం పరిశీలించారు. రోడ్డు మరమ్మతు పనులు నాణ్యతగా జరిగే విధంగా సిబ్బంది పర్యవేక్షించాలని డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపి నాయక్ ఆదేశించారు. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో మరమ్మత్తు పనులు పూర్తవుతాయని ఆయన తెలిపారు.