రాయికోడ్: రాయికోడ్ తహసిల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి మహిళ నిరసన, రెవెన్యూ అధికారులు అక్రమ పౌతి మార్పిడి చేశారని ఆవేదన
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల తాసిల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పిప్పడుపల్లి గ్రామానికి చెందిన శంకరమ్మ తన కూతురు అల్లుడితో కలిసి నిరసన వ్యక్తం చేసింది. తన అత్త పారమ్మ మృతి చెందడంతో ఆమె పేరు పై ఉన్న ఒక ఎకరా 20 గుంటల భూమిని తన బావలు తనకు రావలసిన వాటా ఇవ్వకుండా అక్రమ పౌతి మార్పిడి చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రాయికోడ్ రెవెన్యూ అధికారులు పౌతి మార్పిడి చేసి తన అన్యాయం చేశారంటు తాసిల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసనకు దిగింది.