రాజంపేట ఎమ్మెల్యే ఎంపీ జిల్లా కేంద్రం కోసం అసెంబ్లీ, పార్లమెంట్లో గళం వినిపించాలని రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు డిమాండ్ చేశారు. తన కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ గతంలో మేము తప్పు చేశాం అన్న అసెంబ్లీలో వారు ఒప్పుకోవాలని ఆయన కోరారు. కొన్ని వేదికల వద్దకు వెళ్లి ప్రాంతీయవాదం రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఇది పద్ధతి కాదని అన్నారు. రాజంపేట ప్రాంతానికి అన్యాయం చేశారని అన్నారు.