సంగారెడ్డి: జిల్లాలోని జూనియర్ కళాశాలకు రూ.3.50 కోట్ల నిధులు మంజూరు
సంగారెడ్డి జిల్లాలోని 20 జూనియర్ కళాశాల మరమ్మతుల కోసం రూ.3.50 కోట్ల నిధులు మంజూరైనట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ కళాశాలలోని భవనాలకు మరమ్మతులు చేయిస్తామని పేర్కొన్నారు. ప్రతి కళాశాలకు వైట్‌కలర్ రంగులు వేయించాలని ప్రిన్సిపల్‌కు సూచించారు. నిధులను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.