కుమ్మరవాండ్లపల్లిలోని హమాలీ క్వార్టర్స్ లో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఖాళీ బిందెలతో నిరసన
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మండల పరిధిలోని కుమ్మరవాండ్ల పల్లిలో గల హమాలీ క్వార్టర్స్ లో తాగునీటి సమస్య పరిష్కరించాలని కాలనీవాసులు గురువారం పంచాయితీ కార్యాలయం ఎదుట నిరసన ఖాళీ బిందెలతో కార్యక్రమాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజులుగా నీటి సమస్య అధికంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. గ్రామంలో చెడిపోయిన బోరును వెంటనే మరమ్మత్తు చేయించాలని అధికారులకు, సర్పంచ్ కు విజ్ఞప్తి చేశారు.