తమ భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని పాముదుర్తి రైతులు కలెక్టర్ ను కలిసి వినతి
వైయస్సార్సీపీ ప్రభుత్వంలో సర్పంచ్ గా పోటీ చేసినందుకు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితురాలు సుజాత పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వచ్చిన బాధితులు కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందించారు.బుక్కపట్నం మండలం పాముదుర్తికి చెందిన సుజాత గత సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేశారు. అప్పుడు కూడా టిడిపి నాయకులు ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. కానీ అవన్నీ భరించి పోటీ చేస్తే ఓడిపోవడం జరిగింది. కానీ అదే మనసులో పెట్టుకున్న స్థానికుడు ఇంద్రజిత్ రెడ్డి టీడీపీ నాయకులతో కలిసి తమ భూమిలోకి పోనివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సుజాత ఆవేదన వ్యక్తం చేశారు