రాయదుర్గం: మడేనహళ్లి గ్రామ శివారులో ఆరుగురు పేకాటరాయుళ్ళను అరెస్టు చేసిన పోలీసులు
డి.హిరేహాల్ మండలంలోని మడేనహళ్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 6 మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం తమకు రాబడిన సమాచారంతో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించామన్నారు. రెడ్ హ్యాండెడ్ గా ఇరుగురిని అరెస్టు చేసి రూ. 31250 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అరెస్టు అయిన వారంతా మడేనహళ్లి గ్రామానికి చెందిన వారనన్నారు.