ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆదివారం నల్గొండ జిల్లా నుండి విచ్చేసిన కూచిపూడి నాట్య గురువులు శ్రీమతి కస్తూరి సాయి సుధా శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో మహా గణపతిమ్, ముషిక్ వాహన, అదిగో అల్లదిగో, నారాయణతే, ఓమ్ నమశ్శివాయతేయ్, రామాయణ శబ్దం, వినాయక కౌతం, తాండవ నృత్యకారి, లలిత హారతి, జతిస్వరం, తాండవ నృత్యకారి, గరుడ గమన, మొదలైన అంశాలను అక్షిత, తేజో అనన్య, సహస్ర, మోక్ష, లిథిక శ్రీలక్ష్మి, వాసవి, వర్షిణి, తన్మయి, హాస్య మొదలైన వారు ప్రదర్శించి,మెప్పించారు.