కలికిరిలో దాతల సహకారంతో శరవేగంగా సాగుతున్న స్మశాన వాటిక పనులు, ప్రహరీ నిర్మాణానికి 6లక్షలు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే
దాతల సహకారంతో స్మశాన వాటిక నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 6లక్షలు నిధులు మంజూరు చేశారు. కలికిరి మండలం కలికిరి పట్టణంలోని పెద్ద చెరువు తూర్పు మొరవ వద్ద వంద సం.కు పైగా అభివృద్ధికి నోచుకోని స్మశాన వాటిక ను ఒక సంఘటన ద్వారా కులమతాలకు అతీతంగా డిష్ ఎర్రమ రెడ్డి,ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బైరిశెట్టి రమేష్ బాబు, టీచర్ అల్లా బక్ష్, హెడ్ మాస్టర్ ప్రకాష్ లు ముందుండి స్మశాన వాటిక అభివృద్ధికి పూనుకున్నారు. ఇదే తనువుగా కలికిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ రెడ్డి వారి యోగేష్ రెడ్డికి తెలపడంతో వారికి తన వంతు సహకారంగా నిలిచారు