ఆంధ్ర నుండి ఒడిశాకు తరలిపోతున్న పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా పై విజిలెన్స్ అధికారుల దాడులు
ఆంధ్ర నుండి ఒడిశాకు అక్రమంగా రవాణా అవుతున్న పిడిఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు శనివారం పాచిపెంట మండలం పి. కొనవలస చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. 34,800 కిలోల 700 బస్తాలు పిడిఎఫ్ బియ్యం కడుమ గ్రామం నుండి లారీలో ఒడిశా నవరంగపూర్ కు తరలిస్తుండగా డ్రైవర్ మానేపల్లి వెంకటేష్, ఓనర్ గోవిందరావులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్, రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.