వికారాబాద్: త్రిబుల్ ఆర్ భూసేకరణ పై రైతులకు ప్రభుత్వం పూర్తి సమాచారం ఇచ్చి భరోసా కల్పించాలి: దిశా కమిటీ మెంబర్ వడ్ల నందు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న త్రిబుల్ ఆర్ పై రైతులు గత నెల రోజులుగా అటు హైదరాబాదులో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవో కార్యాలయంలో భూసేకరణ పై పూర్తి సమాచారం ఇవ్వాలంటూ అర్జీలు సమర్పిస్తున్న ఇంతవరకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని సోమవారం జిల్లా కేంద్రంలో ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బి ఆర్ ఎస్ బిజెపి నాయకులు మద్దతు తెలుపుతూ దిశా కమిటీ మెంబర్ వడ్ల నందు మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం పూర్తి సమాచారం ఇచ్చి భరోసా కల్పించాలన్నారు