ప్రకాశం జిల్లా రాచర్ల ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన సర్పంచ్ రమేష్ ను ఎస్ఐ కోటేశ్వరరావు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అన్నం పల్లె పంచాయతీ సర్పంచ్ అయిన రమేష్ పంచాయతీ అభివృద్ధికి ఖర్చు చేసిన నిధులను బకాయిలను విడుదల చేయాలని ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసనకు దిగాడు. ఎంపీడీవో ఫిర్యాదు మేరకు ఎస్సై కోటేశ్వరరావు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో శుక్రవారం వైరల్ గా మారింది.