ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అధ్యాపకుల నివేదన సభలు నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరా మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 1200 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నారని, వారికి సుప్రీంకోర్టు చెప్పిన విధంగా సమాన పనికి సమాన వేతనం లభించడం లేదని తెలిపారు. ఇది కాంట్రాక్ట్ అధ్యాపకుల ప్రధాన సమస్య అని వారు పేర్కొన్నారు.