రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు కొత్త మంచూరు జిడ్పీ హైస్కూల్ విద్యార్థి ఎంపిక
మదనపల్లి రూరల్ మండలం సిటియం ఉన్నత పాఠశాలలో ఇటీవల జరిగిన అండర్-19 జిల్లా స్థాయి ఆటల పోటీల్లో వాల్మీకిపురం మండలం కొత్త మంచూరు జిడ్పీ హైస్కూల్ విద్యార్థి తన సత్తా చాటాడు. అండర్-19 విభాగం రగ్బీ పోటీల్లో కొత్త మంచూరు హైస్కూల్ విద్యార్థి వెంకటరమణ పాల్గొని మంచి ప్రతిభ చూపి ఉమ్మడి చిత్తూరు జిల్లా తరపున రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని హెచ్ఎం వి.ప్రకాశ్ మంగళవారం తెలిపారు.ఇదిలా ఉండగా ఇదే పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థినులు నెట్ బాల్ పోటీలలో మంచి ప్రతిభ సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విషయం తెలిసిందే. రగ్బీ పోటీలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని హెచ్ ఎం అభినందించారు