జమ్మలమడుగు: అట్లూరు : అర్హులైన పేదలందరికీ వ్యవసాయ భూమి ఇంటి స్థలాలు ఇవ్వాలి - సిపిఎం నాయకులు
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని అట్లూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అట్లూరు మండలంలో ఉన్న అర్హులైన పేదలందరికీ వ్యవసాయ భూములు ఇంటి స్థలాలు ఇవ్వాలని ధర్నా నిర్వహించి తహసీల్దార్ సుబ్బలక్ష్మమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చాంద్ భాషా , అట్లూరు మండల సిపిఎం పార్టీ కార్యదర్శి రమణయ్య మాట్లాడుతూ అట్లూరు మండలంలో అనేక సర్వే నంబర్లు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు వందలాది ఎకరాలు ఉన్నాయి ఈ భూములను అట్లూరు మండలంలోని గ్రామాల్లో ఉన్న అర్హులైన అర్హులైన పేదలందరికీ పంచాలన్నారు.