ఇబ్రహీంపట్నం: ఎల్లమ్మ బండ హిందూ స్మశాన వాటిక సుందరీ కరణ పనులను పకడ్బందీగా చేస్తున్నాం: కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
అల్విన్ కాలనీ డివిజన్లోని ఎల్లమ్మబండ హిందూ స్మశాన వాటిక అభివృద్ధి పనులలో భాగంగా 49 లక్షల వ్యయంతో చేపడుతున్న బర్నింగ్ ప్లాట్ఫామ్ స్లాబ్ నిర్మాణ పనులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎల్లమ్మబండ హిందూ స్మశాన వాటిక సుందరీకరణ పనులను పకడ్బందీగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అన్నారు.