కర్నూలు: ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ ని కలిసిన: కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు
ఢిల్లీలోని పార్లమెంటులో గల టీడీపీ పార్లమెంటరీ కార్యాలయానికి వచ్చిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మర్యాద పూర్వకంగా మంగళవారం ఉదయం 10 గంటలకు కలిశారు. పార్లమెంట్ సమావేశాలలో పాల్గొంటున్న ఎంపీ, మొంథా తుఫాను ప్రభావం వలన రాష్ట్రంలో జరిగిన నష్టం అంచనా సమగ్ర నివేదికను కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ కు అందించేందుకు వచ్చిన లోకేష్ ను కలిసి శాలువాతో సత్కరించారు... ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు జిల్లా లో మొంథా తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని లొకేష్ కి వివరించారు.