మొక్కు మండలం శంబర గ్రామంలో డ్రమ్ సీడర్ పద్ధతిలో నవధాన్యాలు నాట్లు వేయించిన ప్రకృతి వ్యవసాయ అధికారులు
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో మంగళవారం ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ అధికారి ఎమ్.శ్రవణ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి సిహెచ్. భారతి ఆధ్వర్యంలో వరి డ్రమ్ సీడ్ పద్ధతిలో నవధాన్యాలు నవధాన్యాలు నాట్లు వేయించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రమ్ సీడర్ పద్ధతిలో ముందుగా ఐదు రకాలు నవధాన్యాలు మినుములు రెండు కేజీలు, పెసలు రెండు కేజీలు, ఉలవలు రెండు కేజీలు, బొబ్బర్లు రెండు కేజీలు గోంగూర పావు కేజీ, తోటకూర పావుకేజి, నువ్వులు కేజీన్నర మొత్తం ఒక ఎకరానికి పది కేజీలు చొప్పున వేద చల్లి, తరువాత డ్రమ్ సీడర్ వేసుకువాలని సూచించారు. ఇలా వేయడం వల్ల కలుపు తగ్గుతుందన్నార.