పూతలపట్టు: కే జి సత్రం సిద్ధేశ్వరస్వామి కొండకు పోటెత్తిన భక్తులు
బంగారుపాళ్యం మండలంలోని కె.జి.సత్రం వద్ద గల చీకూరుపల్లి సిద్ధేశ్వర కొండపై వెలసిన శ్రీపార్వతి సమేత సిద్ధేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు.మూడవ కార్తీక సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉసిరి చెట్టు కింద కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా జరగకుండా గ్రామస్తులు దర్శనం ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందించారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.స్వామి వారిని అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ పద్మనాభ నాయుడు దంపతులతో పాటు అమ్మఒడి బృందం సభ్యులు దర్శించుకోవడం జరిగింది.